గవర్నర్‌కు ఎంపీ ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు ఎంపీ ఆహ్వానం

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

మొక్కలు నాటే కార్యక్రమానికి రావాలని కోరిన ఎంపీ రఘునందన్‌రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సేవా సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా అక్టోబర్‌ 6న రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు నిర్వహించనున్న మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను ఎంపీ రఘనందన్‌రావు ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో ఈ మేరకు బుధవారం ఆహ్వాన పత్రాన్ని అందించినట్లు తెలిపారు. తనతో పాటుగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్‌ రాధా మల్లేశ్‌గౌడ్‌ ఉన్నారన్నారు.

ఆరు గ్యారంటీలను

అమలు చేయాలి

ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవి

గజ్వేల్‌రూరల్‌: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటికొండ రవి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ మేరకు ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తహసీల్దార్‌ ద్వారా వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థికభారం పడు తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు శేఖర్‌, రవి, వినయ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

చేర్యాల మున్సిపల్‌

కమిషనర్‌గా అభిలాష్‌

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ నూతన కమిషనర్‌గా అభిలాష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఇక్కడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సుంచు నాగేందర్‌ బుధవారం పదవీ విరమణ పొందారు. గ్రూప్‌–2 ద్వారా నియమితులైన వి.అభిలాష్‌ను నియమించారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ముచ్చర్ల నాగరాజు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): భారతీయ జనతా యువ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా చిన్నకోడూరు మండలం ఓబులాపురానికి చెందిన ముచ్చర్ల నాగరాజు నియామకమయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌ బుధవారం నియామకం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా నియమితులైన నాగరాజు మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌తో పాటు రాష్ట్ర నాయకత్వానికి నియామకానికి సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

భారీ పోలీసు బందోబస్తు

సీఎం రేవంత్‌ రోడ్డు మార్గంలో

హైదరాబాద్‌ ప్రయాణం

సిద్దిపేటకమాన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి చాపర్‌లో వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌, సిరిసిల్ల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా కాన్వాయ్‌లో ప్రయాణమయ్యారు. సీఎం రోడ్డు మార్గం ద్వారా వెళ్లనుండడంతో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రాజీవ్‌ రహదారిపై భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీపీ రష్మీ పెరుమాళ్‌ ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement