ఉపాధి పనులపై సామాజిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

రూ. 30,407 జరిమానా విధించిన అదనపు డీఆర్‌డీఓ

రూ. 30,407 జరిమానా విధించిన అదనపు డీఆర్‌డీఓ

వర్గల్‌(గజ్వేల్‌): ఉపాధి పనుల్లో చిన్నపాటి లోపాలకు సైతం తావీయకుండా మరింత పకడ్బందీగా నిర్వహించాలని అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రూ.5.2 కోట్లతో మండలంలో ఉపాధిపనులు జరగగా, రిజిష్టర్‌ నిర్వహణ, కొట్టివేతలు, వేతన చెల్లింపుజాప్యం తదితరలోపాలపై ఉపాధి సిబ్బందికి రూ.30,407 జరిమానా విధించడంతోపాటు నగదు రికవరీకి ఆయన ఆదేశించారు. వర్గల్‌ మండలంలో ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు చేపట్టిన ఉపాధి పనులపై స్థానిక మండల పరిషత్‌ సమావేశమందిరంలో బుధవారం ఆయన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో గ్రామపంచాయతీల వారీగా చేపట్టిన పనులు, రికార్డులు, సోషల్‌ ఆడిట్‌ అంశాలను వేదికలో రిసోర్స్‌పర్సన్లు నివేదించారు. గ్రామాల వారీ నివేదికల విచారణ అనంతరం అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ...రిజిష్టర్‌ నిర్వహణ, కొట్టివేతలు, వేతన చెల్లింపు తదితర అంశాల్లో లోపాలు వెల్లడైనట్లు పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి, 2026 మార్చి 31వరకు ఉపాధిహామీ పథకం ద్వారా వర్గల్‌ మండలంలో రూ.5,20,70,128 నిధులతో 409 పనులు జరిగాయన్నారు. ఇందులో రూ. 4,19,49,937 కూలీలకు వేతనం, రూ. 1,01,20,191 సామగ్రి కోసం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చెల్లించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడీ ఆనంద్‌మేరీ, ఎంపీడీఓ సురేశ్‌, ఎంపీఓ సాయిలు, క్వాలిటీ కంట్రోలర్‌ సంతోశ్‌, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అధికారి గణేశ్‌, ఈసీ రాజు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement