పకడ్బందీగా భూముల రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా భూముల రీ సర్వే

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

కలెక్టర్‌ హైమావతి

పుల్లూరులో భూ రీ సర్వేను

పరిశీలించిన కలెక్టర్‌

సిద్దిపేటరూరల్‌: ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వేను మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హైమావతి సర్వే అధికారులను ఆదేశించారు. రూరల్‌ మండలం పుల్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న భూ భారతి – భూ సర్వే, రీ–సర్వే ప్రక్రియను కలెక్టర్‌ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూముల సర్వే చాలా కాలం నుంచి పెద్ద సమస్యగా మారిందని గ్రహించిన ప్రభుత్వం భూ సర్వే చేస్తుందన్నారు. ప్రభుత్వం ఈ రీ సర్వే కోసం రూ.7 లక్షలతో అధునాతన పద్ధతుల్లో సర్వే చేయడానికి రోవర్స్‌లను కొనుగోలు చేసిందని, దీనివల్ల అత్యంత కచ్చితత్వంతో భూములను కొలిచి పకడ్బందీగా హద్దులను ఇవ్వడం జరుగుతుందన్నారు. రీ సర్వే పూర్తయిన అనంతరం ప్రతీ రైతుకు వారి భూమికి సంబంధించిన మ్యాప్‌ను కచ్చితమైన కో ఆర్డినేట్లతో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే యాసంగిలో రైతులు వరి సాగు చేయకూడదని, ఆరుతడి పంటల సాగు చేపట్టాలన్నారు. యాసంగిలో నీటి కొరత తీవ్రంగా ఉంటుందని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రూరల్‌ తహసీల్దార్‌ రెహమాన్‌, ఆయా మండల సర్వే అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement