పేరు గొప్ప.. వసతులు దిబ్బ | - | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప.. వసతులు దిబ్బ

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

మూలనపడిన ఫాగింగ్‌ యంత్రం దోమల నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు కరువు ప్రజారోగ్యానికి ముప్పు... పట్టని యంత్రాంగం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో దుస్థితి

గజ్వేల్‌: జిల్లాలో సిద్దిపేట తర్వాత రెండో ప్రధాన మున్సిపాలిటీ గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో ప్రజారోగ్యంపై శ్రద్ధ కరువైంది. ఫాగింగ్‌, బ్లీచింగ్‌ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న ఫాగింగ్‌ యంత్రం పనిచేయడం లేదు. దీని స్థానంలో కొత్తది వెంటనే కొనుగోలు చేసి దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలనే ఆలోచన యంత్రాంగానికి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మురుగు కాల్వల్లో బ్లీచింగ్‌ చర్యలు కరువయ్యాయి. అభివృద్ధికి నమునాగా ఊదరగొట్టిన గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ నేడు కనీస వసతుల్లేక అల్లాడుతోంది. పెరుగుతున్న ప్రజల అవసరాలకనుగుణంగా మున్సిపాలిటీ సేవలు అందటం లేదు. ప్రత్యేకించి పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇళ్ల మధ్య పొదలతో దోమల వ్యాప్తి

పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్ల మధ్యన ఉన్న ఖాళీ స్థలాల్లో పొదలు అల్లుకుపోయి దోమల వ్యాప్తి పెరిగిపోతోంది. ఏళ్ల తరబడి సదరు ప్లాట్ల యజమానులు పొదలు తొలగించకపోవడం, మున్సిపాలిటీ వైపు నుంచి తగు ఆదేశాలివ్వకపోడం పరిస్థితి అధ్వానంగా మారింది. పట్టణంలోని లక్ష్మీప్రసన్ననగర్‌ కాలనీ, పలు కొత్త కాలనీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా జనం వ్యాధుల బారిన పడటం సర్వసాధారణంగా మారుతోంది.

మూలకుపడ్డ ఫాగింగ్‌ యంత్రం

దోమల నియంత్రణకు ఉపయోగించే ఫాగింగ్‌ యంత్రం గత కొన్ని నెలల కిత్రం మూలన పడింది. రిపేర్‌ చేసినా బాగుపడే పరిస్థితి లేదని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఈ యంత్రం లేక నెలల తరబడి ఫాగింగ్‌ జరగటం లేదు. దీంతో దోమల నియంత్రణ సక్రమంగా సాగటం లేదు. కొత్త యంత్రం కొనుగోలు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలనే ఆలోచన మున్సిపల్‌ పాలకవర్గానికి, అధికారులకు లేకుండాపోయింది. పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ లేని చోట ఓపెన్‌ డ్రైనేజీలు ధ్వంసమై...మురుగునీరు రోడ్ల పక్కన, వీధు ల్లో పారుతోంది. ఈ ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చర్యలు కరువయ్యాయి. ఫలితంగా ప్రజలు ముక్కుపుటలదిరే దుర్గంధం మధ్యనే కాలం గడుపుతున్నారు.

చెత్త సేకరణలో శాసీ్త్రయత ఏదీ?

పట్టణంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్‌ టన్నుల పైనే. ఇక్కడ 162మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 50మందికిపైగా సిబ్బంది అవసరముంటారు. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పది వాహనాలు అవసరమున్నాయి. తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం మొక్కుబడి సాగుతోంది. డంపింగ్‌ యార్డు నిర్వహణ అధ్వానంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement