న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● దుబ్బాకలో మిన్నంటిన వినాయక నిమజ్జనం ● కళ్లు చెదిరే లైటింగ్.. ఆకట్టుకున్న నృత్యాలు
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. శనివారం రాత్రి ప్రారంభమైన శోభయాత్ర ఆదివారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసింది. వినాయక నిమజ్జనంలో జిల్లాలో దుబ్బాక ప్రతీ ఏటా ప్రత్యేకతను సంతరించుకుంటోంది.
ఆకట్టుకున్న వేషధారణ
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన శోభయాత్రలో వేషధారణలు ఆకట్టుకున్నాయి. అలాగే పలు వినాయక మండపాల వద్ద వేసిన లైటింగ్, డీజే సెటప్ యువతీ యువకులను ఆకర్షించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.


