యూపీఐ పేమెంట్‌లపై కొత్తగా చార్జీలు విధించడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలు తగ్గించి ఆన్‌లైన్ పేమెంట్‌లో ప్రోత్సహించి ఇప్పుడు కొత్తగా ఈ చార్జీల భారం మోపడం పేద సామాన్య మధ్యతరగతి వ్యాపారులు ప్రజలను ఇబ్బందుల గురి చేయడమే. ఈ చార్జీల భారం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
వెంకట రాజశేఖర్‌రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్, దుబ్బాక
మళ్లీ నగదు రూపంలో చెల్లింపులు చేస్తాం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ.2వేలకు పైగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు పెంచడం సరికాదు. ఇలా చార్జీలు వేయడం వలన వినియోగదారుడిపైనే అదనపు భారం పడుతుంది. ఇలా భారం మీద పడే బదులు మళ్లీ నగదు రూపంలో చెల్లింపులకే మొగ్గు చూపుతాం. దీంతో మళ్లీ ఏటీఎంలు, బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుంది.
పచ్చిమట్ల రవీందర్ గౌడ్, హుస్నాబాద్


