ప్రజల హక్కులు కాపాడటంలో ముందుంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రజల హక్కులు కాపాడటంలో ముందుంటాం

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

సిద్దిపేటకమాన్‌: ప్రజా హక్కులను కాపాడడంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది పోరాటాలు, త్యాగాల వల్ల స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాపాడే బాధ్యత ఎక్కువగా పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు కుశాల్కర్‌, సుభాష్‌చంద్రబోస్‌, సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement