చేయూతకు దరఖాస్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

చేయూతకు దరఖాస్తుల వెల్లువ

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

సాక్షి, సిద్దిపేట: చేయూత పెన్షన్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో ప్రస్తుతం వివిధ రకాల చేయూత పెన్షన్లు 1,81,915 ఉండగా రూ. 39,34,54,640 నగదును అందజేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 14,477 మంది వివిధ రకాల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పరిశీలనకు అధికారుల నియామకం

ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 226 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే గ్రామాలకు, పట్టణాల్లో వార్డులకు ప్రత్యేక అధికారులకు ఎంపిక చేసే బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. చేయూత ప్రత్యేక యాప్‌లో దరఖాస్తుల వివరాలతో పాటు లాగిన్‌లను అందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి ఎంపీడీఓ లాగిన్‌కు పంపించనున్నారు. గ్రామాలకు చెందినవి ఎంపీడీఓలు, పట్టణాలకు చెందినవి మున్సిపల్‌ కమిషనర్‌లు అమోదం తెలపనున్నారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందించే అవకాశం ఉంటుంది.

జిల్లావ్యాప్తంగా 14వేల మంది దరఖాస్తు

ప్రస్తుతం 1.81లక్షల పెన్షన్లు

25లోగా క్షేత్ర స్థాయిలో విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement