హక్కులు, బాధ్యతలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

హక్కులు, బాధ్యతలపై అవగాహన

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.సౌజన్య

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.సౌజన్య

సిద్దిపేటఅర్బన్‌: ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు వంటి చట్టపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.సౌజన్య స్పష్టం చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో చట్టాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు తమకు సంబంధించిన వివిధ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, న్యాయ పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయం గురించి తెలుసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో త్రీటౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఏఓ బి.శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement