పీసీసీ చీఫ్‌ను కలిసిన బండారు | - | Sakshi
Sakshi News home page

పీసీసీ చీఫ్‌ను కలిసిన బండారు

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

పాపన్నపేట(మెదక్‌): క్రీడలతో ఆర్యోగంగా ఉంటారని పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రం పాపన్నపేట స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన విధానంలో క్రీడలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో ఆటల కోసం పీరియడ్‌లు ఉండాలన్నారు.

గజ్వేల్‌: టీపీసీసీ అధ్యక్షునిగా పదవీబాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు గజ్వేల్‌కు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో పార్టీ విజయపథంలో నడుస్తున్నదని శ్రీకాంత్‌రావు చెప్పారు.

హిందీ పురస్కారాల ప్రదానం

చిన్నకోడూరు(సిద్దిపేట): జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్‌ ఉన్నత పాఠశాలలో హిందీ పధ్యపఠన విజేతలకు హిందీ పురస్కారాలు అందజేశారు. హిందీ ఉపాధ్యాయులు, కవి భైతి దుర్గయ్య సహకారంతో 45 పద్యాలు చదివిన ఇద్దరు విద్యార్థులకు హిందీ కవితారత్న, 30కి పైగా చదివిన ఐదుగురు విద్యార్థులకు హిందీ కవితా భూషణ్‌, 15కు పైగా చదివిని నలుగురు విద్యార్థులకు హిందీ కవితాశ్రీ పురస్కారాలు, బహుమతులు అందజేశారు. హిందీ చేతివ్రాత, జ్ఞాపక శక్తి పరీక్ష, ఉపన్యాసం, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

పేద కుటుంబానికి

కార్మికుల అండ

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మేడిపల్లిలో పేద భవన నిర్మాణ కార్మికుడు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెరుకు నారాయణ మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 వేలు ఆర్థిక సాయం, బియ్యం అందజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికులు తదితరులు ఉన్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

దుబ్బాకటౌన్‌: మున్సిపల్‌ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు సైతం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుబ్బాక మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని రెండు పడక గదుల గృహ సముదాయంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ చెత్తను పారిశుద్ధ్య వాహనాల్లో వేయాలని, ఇష్టారీతిన మురుగు కాల్వల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేయరాదన్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది దిలీప్‌, అనిల్‌, విష్ణు తదితరులు ఉన్నారు.

పీసీసీ సోషల్‌ మీడియా

కార్యదర్శిగా డీవీ రావు

బెజ్జంకి(సిద్దిపేట): టీపీసీసీ సోషల్‌ మీడియా కార్యదర్శిగా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దోనె వెంకటేశ్వర్‌రావును నియమించినట్లు రాష్ట్ర చైర్మన్‌ నవీన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్‌రావును మంగళవారం సహకార సంఘం చైర్మన్‌ ఒగ్గు దామోదర్‌ ఘనంగా సన్మానించారు.

క్రీడలతో ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement