● ఊరువాడలో విశేష పూజలు ● అంబరాన్నంటిన సంబురాలు
గణపయ్యలు ఘనంగా మండపాలలో కొలువుదీరారు. జిల్లావ్యాప్తంగా సోమవారం పట్టణాలు, గ్రామలు, వాడవాడల్లో వినాయక ప్రతిమలను మండపాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం వేద పండితులతో గణపతి హోమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి వివిధ రకాల తీర్థప్రసాదాలు, నైవేద్యాలను సమర్పించారు. దీంతో జిల్లాలో గణపతి నామస్మరణ మార్మోగుతోంది.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)


