సిద్దిపేటజోన్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (ఇంజనీర్స్ డే)ని మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద..
గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని కోమటిబండ గుట్టపైగల మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద మంగళవారం ఇంజినీర్స్‌డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు రామ్ ఫణిధర్‌రావు, మల్లేశంగౌడ్, సత్యనారాయణలు డివిజన్ స్థాయి ఇంజీనర్లును సన్మానించారు. అనంతరం ఇంజినీర్ల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ సీఈ రాంచందర్‌నాయక్, సిద్దిపేట ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, గజ్వేల్ ఈఈ శ్రీనివాస్, గజ్వేల్ డీఈ రాజు, కొండపాక డీఈ నాగార్జున, ఏఈఈలు శ్రీధర్, పవన్‌కుమార్, గౌతమ్, విశ్లేష్, వీణ, గాయత్రితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


