హుస్నాబాద్: తెలంగాణ విమోచనను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 1997 నుంచి పోరాటం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.


