ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి
హుస్నాబాద్: ఈ విద్యా సంవత్సరం కూడా పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలల్లో వేర్వేరుగా ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లా డుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్ధాయిలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, ప్రిన్సిపాల్స్ లలిత, గంగాధర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కళాశాలల్లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
సిద్దిపేటఎడ్యుకేషన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వక్తలు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం మట్టివినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీత, డాక్టర్ జీవన్‌కుమార్‌లు మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రసాయనాలను కలిపి చేసిన విగ్రహాలతో గాలీ, నీరు, పర్యావరణ కాలుష్యం జరుగుతోందన్నారు. అనంతరం అందమైన ప్రతిమలను తయారు చేసిన విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. ఎన్‌ఎస్‌స్, ఏకోక్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ అయోధ్యరెడ్డి, డాక్టర్ శ్వేత, ఏకోక్లబ్ కన్వీనర్లు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ స్వప్న, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును శుక్రవారం ఇరిగేషన్ ఎస్‌ఈ పల్లెం రాజు, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు నుంచి హుస్నాబాద్‌కు తాగునీటిని సులభంగా సరఫరా చేసేందుకు పంప్‌హౌస్‌ను ఏప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సరఫరాకు అనువైన ప్రాంతాలను పరిశీలించి సాంకేతిక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌లతో పాటు ఇరుగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్: క్రీడల్లో సత్తా చాటాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చందన మాట్లాడారు. నిరంతర సాధన ద్వారా క్రీడా పటిమను పెంపొందించుకోవాలన్నారు. ఈ సెలెక్షన్స్‌లో 450మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పద్మాబాయి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


