మండపాలకు ఉచిత విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

మండపాలకు ఉచిత విద్యుత్‌

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

సాక్షి, సిద్దిపేట: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్‌ భద్రత ఎంతో ముఖ్యమైందని మండలపాల నిర్వాహకులు విద్యుద్దీపాలతో అలంకరణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలని ఎస్‌పీడీసీఎల్‌ సిద్దిపేట జిల్లా ఎస్‌ఈ చంద్రశేఖర్‌ సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానుండటంతో మండప నిర్వాహకులు పాటించాల్సిన సూచనలపై ఎస్‌ఈని శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే....

ఈసారి ఉచిత కరెంట్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఏడాది సైతం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. నాణ్యమైన, సరైన సామర్థ్యం కలిగిన ఎంసీబీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న వైర్లను వినియోగించవద్దు. వర్షం పడినప్పుడు తడిసిన వైర్లు, విద్యుత్తు పరికరాలను తాకవద్దు. మండపాలకు సీరియల్‌ లైట్లు వేసినప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

విద్యుత్తు సిబ్బందికి వివరాలు చెప్పాలి

వినాయక మండపం వద్ద ఎన్ని లైట్లు, మైక్‌ సెట్‌, ఇంకా వినియోగించే వాటి వివరాలు మండపం దగ్గరకు వచ్చే విద్యుత్‌ సిబ్బందికి చెప్పాలి. టీజీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ససా యాప్‌లో వివరాలు నమోదు చేసి ఫొటో తీసుకుంటారు. విద్యుత్‌ లైన్ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దు.

తీసుకొచ్చేప్పుడు.. నిమజ్జనానికి జాగ్రత్తలు పాటించాలి

విగ్రహాలు మండపం వద్దకు తీసుకొచ్చేప్పుడు, నిమజ్జన సమయంలో తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్‌ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్తంభాల చుట్టూ ఇతర ప్రైవేట్‌ కేబుల్స్‌ కూడా ఉంటాయి. విద్యుత్తు తీగ నేరుగా తాకకపోయినా దగ్గరగా వెళ్లడం వల్ల విద్యుత్తు సరఫరా, ఇండక్షన్‌ కారణంగా ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. విద్యుత్‌ లైన్లకు దూరంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఏమైనా విద్యుత్‌ సమస్యలు ఉంటే నంబర్‌కు 1912 ఫోన్‌, 8712441912 నంబర్‌కు వాట్సప్‌ చేయవచ్చు. వెంటనే సంబంధిత విద్యుత్‌ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.

వినాయక మండపాల వద్ద విద్యుత్‌ భద్రత ఎంతో ముఖ్యం

మండపాల వద్దకు వచ్చే సిబ్బందికి వివరాలు చెప్పాలి

విద్యుత్‌ సమస్యలుంటే ఈ నంబర్‌కు 8712441912 వాట్సప్‌ చేయండి

‘సాక్షి’తో టీజీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement