కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

దుబ్బాక: పట్టణంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్‌ నాయకులు గురువారం ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యేపై అనుచిత వాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్‌, సీనియర్‌నాయకులు ఆస స్వామి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మచ్చ శ్రీనివాస్‌ సైతం కాంగ్రెస్‌ నాయకులు కాల్వ నరేశ్‌, మల్లుగారి చంద్రారెడ్డి, శ్రీరాం నరేందర్‌, సత్తు శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల భరత్‌, స్వామితో కలిసి తనను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని, తనకు ప్రాణభయం ఉందంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల మధ్య సోషల్‌ మీడియాలో సైతం జోరుగా విమర్శలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

దుబ్బాక పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement