ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: ‘సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం మంచి పరిణామం కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ చేసి చూస్తే అర్థమవుతుందని’ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఫోన్ లో సాక్షితో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎంత కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారో తెలుస్తోందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కు ఉసిగొల్పడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఎర్రవల్లికి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మధ్యలోనే పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.


