సిద్దిపేటకమాన్: పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందేనని, అప్పటి వరకు రైస్ మిల్లులకు తాళం వేస్తామని జిల్లా రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షుడు చింత రాజు తెలిపారు. పట్టణంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సివిల్ సప్లై నుంచి మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్, ఇతర చార్జీలు రానందున మిల్లర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి ఎఫ్‌సీఐ వారు స్థలం చూపెట్టకపోవడంతో అదే సీజన్‌లో డెలివరీ చేయలేక పోతున్నామని, దీంతో మిల్లులను డిఫాల్టర్లుగా చిత్రీకరించి 25శాతం ఫెనాల్టితో పాటు 12శాతం వడ్డీ విధిస్తున్నారన్నారు. కొద్ది రోజులుగా అధికారులు తనిఖీ చేస్తూ మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మిల్లింగ్ ప్రక్రియ నిలిపివేసి, మిల్లులు మూసి వేసి తాళాలు కలెక్టర్‌కు అప్పగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మిల్లర్స్ నాయకులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే
వచ్చే సీజన్‌లో ధాన్యం తీసుకోం
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా, రూరల్ అధ్యక్షులు కొమురవెల్లి చంద్రశేఖర్, చింత రాజు


