కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమ వారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వారికి అభిషేకాలు, నిత్యకల్యాణం, గంగా పూజ, మహాగణపతి పూజ, పంచామృత, ,రసపంచామృత, ఏకదశరుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, పు ష్పార్చన, అన్నపూజ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీని వాస్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


