పంటల సాగుకు ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వాలి. 12 గంటల కరెంట్ ఇవ్వడం వలన వరి పంటలు పారడం లేదు. వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయి. పైపుల ద్వారా నీళ్లు పెట్టి పారిస్తున్నాం.
–భద్రయ్య, రైతు
యూరియా కొరతతో సతమతమవుతున్నాం. పంటలను యూరియా చల్లే సమయానికి యూరియా రావడం లేదు. ఏదో ఒక్క షాపుకు యూరియా వస్తే యాప్‌లో బుక్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌లో సతాయిస్తుండటంతో యూరియా బుక్ కావడం లేదు. యూరియా యాప్‌ను తొలగించాలి. అందరికీ యూరియా అందేలా చూడాలి.
–జోగయ్య, రైతు


