రచయితలకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

రచయితలకు పురస్కారాలు

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

సిద్దిపేటకమాన్‌: కవులు, రచయితలకు పురస్కారాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆచార్య సంపత్‌కుమార్‌ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన పెందోట సభలో ఆయన పాల్గొని రచయితలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్యానికి బాలకిషన్‌ పెట్టని కోట వంటివారన్నారు. పెందోట పురస్కారాలు అందించడం సిద్దిపేట సాహిత్య రంగానికి విశేషమైన విషయమన్నారు. బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పురస్కారాలు అందించినట్లు తెలిపారు. అనంతరం పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘ప్రేరణ కావాలి’ పుస్తకాన్ని ఆవిష్కరించి, కవి సమ్మేళనం నిర్వహించారు. విశ్వతేజ కావ్యశ్రీలకు బాలసాహిత్య పురస్కారాలు, నగదు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో శ్యామల, వెంకటేశం, ఉమారాణి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement