రోస్టర్‌ విధానం రద్దు చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రోస్టర్‌ విధానం రద్దు చేయాల్సిందే

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌

దుబ్బాక:: రోస్టర్‌ విధానం వల్ల మాలలకు తీరని అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్లను పునఃరుద్ధరించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం దుబ్బాకలో ‘హలో మాల.. చలో దుబ్బాక’ కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 31న నిర్వహించతలపెట్టిన రాష్ట్ర సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి కాల్వ నరేష్‌, రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు ర్యాకం శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

సిద్దిపేట న్యాయశాఖ ఉద్యోగులు

సిద్దిపేటకమాన్‌: ఉద్యోగుల పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు రాకేష్‌ దేశ్‌పాండే, రాష్ట్ర కార్యదర్శి కరుణశ్రీ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి న్యాయశాఖ ఉద్యోగులు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కరువైందన్నారు. వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు శ్రీనివాస్‌, వంశీ, సోమశేఖర్‌, శ్రీనివాస్‌రెడ్డి, వినయ్‌, రవిందర్‌, విజేందర్‌, ఉదయ్‌శ్రీ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కార్యవర్గ

సభ్యుడిగా శ్రీకాంత్‌రెడ్డి

తొగుట(దుబ్బాక): బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని గుడికందుల మాజీ ఉప సర్పంచ్‌ మల్లుగారి శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ముదిరాజ్‌ నియామక పత్రాన్ని ఆదివారం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషిచేస్తానన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామకానికి సహకరించిన ఎంపీ రఘు నందన్‌రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.

కో–ఆపరేటివ్‌ సెల్‌ కన్వీనర్‌గా వేణుగోపాల్‌రావు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన జనగామ వేణుగోపాల్‌రావు బీజేపీ జిల్లా కో–ఆపరేటివ్‌ సెల్‌ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆదివారం ఆయన తనపై నమ్మకంతో నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌, మెదక్‌ ఎంపీ రఘనందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement