వామ్మో.. వయ్యారి భామ | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. వయ్యారి భామ

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

య్యారి భామ ఇది ఒక విషపు కలుపు మొక్క. పొలాల్లో పెరిగితే పంటల దిగుబడులు తగ్గిపోతాయి. ఇవే మొక్కలు ఇళ్ల మధ్య పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్రామీణుల పరిభాషలో వయ్యారి భామగా పిలిచే ఈ కలుపు మొక్కలను పార్ధినియంగా పిలుస్తారు. ఇవి వర్షాకాలంలో పెరిగి పుష్పిస్తుంటాయి. గాలి ద్వారా ఒక్కో మొక్క 80 వేల వరకు విత్తనాలను వెదజల్లుతుంటాయి. దీంతో ఈ మొక్కలు కోట్లలో పెరిగి సమస్యకు దారి తీస్తుంటాయి. ఇవి ఎక్కడ పెరిగితే అక్కడ సమస్యలను సృష్టిస్తాయని డాక్టర్లు, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. కనీసం పశువులు కూడా మేయని ఈ వయ్యారి భామ కలుపు మొక్కలను రైతులు, గ్రామీణ ప్రాంత వాసులు సమూలంగా నిర్మూలించుకోవాలని వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు.

– మిరుదొడ్డి(దుబ్బాక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement