1.99 లక్షల ఓటర్ల పేరులో అక్షర దోషాలు | - | Sakshi
Sakshi News home page

1.99 లక్షల ఓటర్ల పేరులో అక్షర దోషాలు

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

‘సర్‌’ ముసాయిదా విడుదల

పుట్టిన తేదీలు సైతం తప్పుగా గుర్తింపు

సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ

అక్టోబర్‌ 19న తుది జాబితా విడుదల

ఓటర్ల వివరాలిలా..

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

హుస్నాబాద్‌ 1,13,501 1,16,715 06 2,30,222

సిద్దిపేట 1,00,978 1,04,324 35 2,05,337

దుబ్బాక 90,940 95,888 01 1,86,829

గజ్వేల్‌ 1,23,442 1,28,346 05< 2,51,793

సాక్షి, సిద్దిపేట: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 9,92,167 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలలను అందించిన 8,74,181 మంది పేర్లతో ఓటరు ముసాయిదాను రూపొందించారు. ఇందులో 1,18,786 మంది ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించకపోవడం, డెత్‌, పర్మినెంట్‌ షిఫ్ట్‌, డబుల్‌ ఓట్లు ఉండటంతో తొలగించారు. అలాగే 1,99,180 మంది ఓటర్ల పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండటంతో వారికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులకు సెప్టెంబర్‌ 16వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి పరిశీలించి అక్టోబర్‌ 19న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

సిద్దిపేటలోనే అధికం

జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించకపోవడం, డెత్‌, పర్మినెంట్‌ షిఫ్ట్‌, డబుల్‌ ఓట్లు ఉండటంతో తొలగించారు. సిద్దిపేటలో 39,170, గజ్వేల్‌ 37,460, హుస్నాబాద్‌లో 24,321, దుబ్బాకలో 17,835 ఓటర్లను తొలగించారు. అలాగే గజ్వేల్‌లోని 60,979 ఓటర్లు, సిద్దిపేటలో 50,061, హుస్నాబాద్‌ 49,216, దుబ్బాకలో 38,924 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం, షిఫ్టింగ్‌కు సైతం దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement