అర్జీలు వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

అర్జీలు వేగంగా పరిష్కరించాలి యథాతథంగా కొనసాగించాలి

ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయిలోనూ ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మొత్తంగా 135 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, ట్రైనీ కలెక్టర్‌ భవ్య, అధికారులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: ప్రభుత్వం వెంటనే జీఓ నంబర్‌ 97 రద్దు చేసి సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటి సభ్యుడు సావుల ఆదిత్య డిమాండ్‌ చేశారు. సాంకేతిక విద్యా వ్యవస్ధను పరిరక్షించాలని సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్ధులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ విలీనం చేయకుండా మరింత బలోపేతం చేసి మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక కోర్సులు కల్పించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement