నైపుణ్యాలను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యలో అమలవుతున్న సిలబస్‌, మూల్యాంకన విధానంపై అధ్యాపకులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(కోఎడ్యుకేషన్‌)లో జూనియర్‌ లెక్చరర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి సైన్స్‌ విద్యార్థులకు ఽథియరీ 60 మార్కులు, ప్రాక్టికల్స్‌ 15 మార్కులు, ఆర్ట్స్‌ విద్యార్థులకు 20 ఇంటర్నల్‌ మార్కుల విధానం ఉంటుందన్నారు. అధ్యాపకులు ప్రతి పాఠ్యాంశంపై ముందస్తుగా సిద్ధమై బోధించాలని చెప్పారు. మారిన సిలబస్‌పై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌న్‌ పూర్తి స్థాయిలో వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం ఫిజిక్స్‌, సివిక్స్‌, జువాలజీ, ఎకనామిక్స్‌ అధ్యాపకులకు డిస్టిక్‌ రోసోర్స్‌పర్సన్‌లు ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకుని విద్యార్థులకు పీపీటీల ద్వారా సులభంగా బోధించే పద్దతులను గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ దేవయ్య, మాస్టర్‌ ట్రైనల్‌ విజయలక్ష్మి, డీఆర్‌పీలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement