విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్‌ చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్‌ చెలగాటం

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ నిధులను విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ మండిపడ్డారు. గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరి శంకర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం, హర్‌ ఘర్‌ తిరంగా, ఫీజుల బకాయి–బీజేపీ లడాయి ఉద్యమాల నిర్వహణపై విస్తృతంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ముందుండి పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బకాయిల విడుదల ఆలస్యం కావడం వల్ల కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలేష్‌, విభీషన్‌ రెడ్డి, మల్లేశం, వెంకట్‌ రెడ్డి, భాస్కర్‌, ఉమా రెడ్డి, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement