● సిద్దిపేటతో అవినాభావ సంబంధం ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. గురువారం జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన భారీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. సిద్దిపేటతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమరుల త్యాగాల స్ఫూర్తిగా సిద్దిపేటలో అమరుల స్తూపం ఆయన చేతుల మీద ప్రారంభం చేసినట్లు గుర్తు చేశారు. ఆయన పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. నేడు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది అంటే అది జయశంకర్. కేసీఆర్ పోరాటం వల్లేనన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్. పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం,మాజీ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు భూపేష్, మోహన్ లాల్, మోహిజ్, బిమసేన పాల్గొన్నారు.


