● జిల్లా విద్యాధికారి రమేశ్
● వర్గల్ హైస్కూల్ విద్యార్థులకు దాత సూర్యరాజు స్పోర్ట్స్‌డ్రెస్ అందజేత
వర్గల్(గజ్వేల్): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్ ఆకాంక్షించారు. లయన్ జీఆర్ సూర్యరాజు వర్గల్ జెడ్పీస్కూల్ విద్యార్థుల కోసం రూ.2 లక్షల విలువైన స్పోర్ట్స్‌డ్రెస్‌లను విరాళంగా అందజేయగా, మంగళవారం వాటిని ఆయనతో కలిసి డీఈఓ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్ సూర్యరాజు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకర జీవన విధానం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, లయన్స్ జిల్లా గవర్నర్ అమర్‌నాథ్‌రావు, వర్గల్ సర్పంచ్ దేవగణిక జయభారతి, ఏఏపీసీ చైర్‌పర్సన్ భవాని తదితరులు పాల్గొన్నారు.


