దుబ్బాకకు నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

దుబ్బాకకు నిధుల వరద

Mar 4 2026 9:01 AM | Updated on Mar 4 2026 9:01 AM

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.1.7 కోట్లు మంజూరు

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.1.7 కోట్లు మంజూరు

దుబ్బాక: పల్లెల్లో పూర్తిగా అధ్వానంగా తయారైన రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు, మురికి కాల్వల నిర్మాణాలకు ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజీఎస్‌) కింద పనులు చేపట్టనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని 17 గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.1.7 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు పనులు ప్రారంభించేందుకు కలెక్టర్‌ హైమావతి పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. దుబ్బాక మండలంలోని రామక్కపేట, పెద్దగుండవెల్లి, శిలాజీనగర్‌ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి, కొండాపూర్‌, అందె, మల్లుపల్లి గ్రామాలకు రూ.10 లక్షలు చొప్పున, భూంపల్లి–అక్బర్‌పేట మండలం రుద్రారం గ్రామానికి రూ.15 లక్షలు, మోతె, చిన్ననిజాంపేట గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, దౌల్తాబాద్‌ మండలం ముత్యంపేట, ముబరాస్‌పూర్‌, తొగుట మండలంలోని వర్దరాజుపల్లి, రాయపోల్‌ మండలంలోని ఆరపల్లి, కొత్తపల్లి, వడ్డెపల్లి గ్రామాలకు 10 లక్షల చొప్పున, టెంకంపేటకు రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాగా, నిధులు మంజూరు చేయించిన ఎంపీ రఘునందన్‌రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement