భూ సర్వేకు శాటిలైట్ టవర్లు
హుస్నాబాద్‌రూరల్: భూ సర్వే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా భూ సర్వే చేయడానికి 70 కి.మీల దూరంలో ఒక శాటిలైట్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఒకటి సిద్దిపేట, మరోటి హుస్నాబాద్ డీఐఓసీ ఆవరణలో నిర్మించడానికి శుక్రవారం పనులు ప్రారంభించారు. శాటిలైట్ ఆధారంగా గ్రామాల్లో సర్వే సులభం కానుంది. పాత భూ రికార్డుల టీపాన్లు (కొలతలు) ఎక్కువ సంఖ్యలో దొరకకపోవడంతో భూముల హద్దుల పంచాయితీలు తెగడం లేదు. శాటిలైట్ ఆధారంగానే నక్షా హద్దులను గుర్తించి భూ విస్తీరణం చెప్పనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు కింద హుస్నాబాద్ డివిజన్ పరిధిలో అక్కన్నపేట మండలంలోని కేశ్వాపూర్, మల్లంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. రెండు గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసిన తర్వాత మిగతా గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు.
శాటిలైట్ టవర్ నమూనా..


