ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో
విశేష ప్రతిభ
చిన్నకోడూరు(సిద్దిపేట): కెనడాకు చెందిన ‘గడుగ్గాయ్ అనే మాస పత్రిక’ సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి విశ్వతేజ విశేష ప్రతిభ చూపారు. విశ్వతేజ రాసిన చందమామ రావే అనే కథకు ద్వితీయ బహుమతి వచ్చింది. సంక్రాంతి పడుగ రోజున నగరంలో నగదుతో పాటు మెడల్ అందజేయనున్నట్లు పాఠశాల హెచ్‌ఎం జ్యోతి తెలిపారు. అదే పాఠశాలకు చెందిన అఖిల, కీర్తి రాసిన కథలకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారన్నారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
మల్లన్న సన్నిధిలో
సినీ దర్శకుడు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అ నంతరం ఆలో ఆలయ ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జిల్లా వ్యవసాయశాఖ
అధికారి స్వరూపరాణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఐడీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
చదువుతోనే
బంగారు భవిష్యత్తు
ములుగు(గజ్వేల్): విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో కృషి చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అమర్‌నాథ్‌రావు సూచించారు. హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చదువుతున్న ములుగు మండలం నర్సంపల్లికి చెందిన కటికల రమ్య విద్యాభాస్యానికి సహాయంగా రూ.92 వేల చెక్కును శుక్రవారం ఆమె సోదరికి అందజేశారు. అలాగే ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఆరవ తరగతి విద్యార్థులకు 75 డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మాణమవుతుందన్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో సేవలు అందించడమే లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయబాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’


