ఇవేం వంటలు?
మీకు నచ్చినట్లు చేసి పిల్లలకు వడ్డిస్తారా
దుబ్బాక: ‘నాణ్యత లేని పప్పుచారు.. అరకొరగా కూరతో విద్యార్థులకు వడ్డిస్తారా?.. మీకు నచ్చిన వంటలు చేసి సగం కడుపుకే పెడతారా.. పౌష్టికాహారం అందించకుండా ఇవేం వంటలు’ అంటూ కలెక్టర్ హైమావతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటగదిలో ఉన్న వంకాయ కూర, పప్పుచారు, గుడ్లు వండిన వంటలను చూసి ఇదేం పప్పుచారు? ఈ కూర ఎంత మందికి సరిపోతుంది? అంటూ వంట సిబ్బందిపై మండిపడ్డారు. హాజరైన 373 మంది విద్యార్థులకు సరిపడా వండలేదని, రోజు వారి విద్యార్థుల హాజరు ప్రకారం స్టాక్ రిజిష్టర్ రాయకుండా ఏదో మొక్కుబడిగా రాసినట్లుగా ఉండటం గమనించి ప్రిన్సిపాల్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన విధంగా వంటచేసి పెడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ ప్రతి విద్యార్థికి ఆహారం సరిపోయేలా వంటలు రుచికరంగా వండాలని ప్రిన్సిపాల్, వంట సిబ్బందిని ఆదేశించారు. ప్రిన్సిపాల్ బుచ్చిబాబుపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫోన్‌లో కలెక్టర్ ఆదేశించారు. అలాగే బాలికల వసతిగృహాన్ని పరిశీలించి మెనూ ప్రకారం వంటలు లేకపోవడంపై హాస్టల్ వార్డెన్ కవిత, వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు.
రెవెన్యూ విభాగంపై
నమ్మకం పెంచాలి
నీళ్లచారు.. అరకొర కూరతో
సరిపెడతారా?
కలెక్టర్ హైమావతి మండిపాటు
వెంటనే చర్యలు తీసుకోవాలని
డీఈఓకు ఆదేశం
లచ్చపేట మోడల్‌స్కూల్,
కళాశాల ఆకస్మిక తనిఖీ
సిద్దిపేటరూరల్: రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పై గౌరవం, నమ్మకం మరింతగా పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కలెక్టర్ కె. హైమావతిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ట్రెసా క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి సేవ అవసరమైన మొదటగా సంప్రదించేది రెవెన్యూ అధికారులనేనన్నారు. మీపై నమ్మకంతో మీ వద్దకు వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలందించి రెవెన్యూ విభాగానికి మరింతగా మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, ట్రెసా నాయకులు పాల్గొన్నారు.


