డిజిటల్ బోధన చేయాల్సిందే
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డిజిటల్ బోధన చేయాలని, మండలాల విద్యాశాఖ అధికారులకు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ‘బడుల్లో డిజి‘డల్’’ కథనానికి స్పందించిన జిల్లా విద్యాశాఖ, జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి పాఠశాలలో డిజిటల్ బోధనలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని మండల అధికారులకు డీఈఓ సూచించారు.
నేటి నుంచి ముగ్గుల పోటీలు
హుస్నాబాద్: నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం నుంచి మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


