600 మందికి ఒక్కటే గీజర్
సిద్దిపేటఅర్బన్: గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు చలికాలంలో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. సరిపడా గీజర్లు లేక చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని గురుకుల పాఠశాల, ఎన్సాన్‌పల్లిలోని సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ స్కూల్, ఎల్లుపల్లిలోని కేజీబీవీ, వెల్కటూరులోని కేజీబీవీలో విద్యార్థినులు చల్లటి నీటితోనే స్నానాలు చేస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. మిట్టపల్లి గురుకుల పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. వీరందరికీ ఒక్క గీజర్ మాత్రమే ఉంది. అదీకూడా ప్రిన్సిపాల్ పదోన్నతిపై వెళ్తూ సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన గీజరే.. విద్యార్థినుల ఇబ్బందులను గమనించి మరో రెండు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి గీజర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.
గురుకులంలో విద్యార్థినుల గజగజ
చన్నీటి స్నానాలే దిక్కు..
దృష్టిసారించని అధికారులు


