కోటి ఆశలతో..మేటి సంబరాలతో..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కోటి ఆశలతో.. మేటి సంబరాలతో సరికొత్త సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు. ఎన్నో మధురజ్ఞాపకాలను, మరపురాని సంగతులను అందించిన 2025కు వీడ్కోలు పలికి.. 2026 సంవత్సరాన్ని ఆత్మీయంగా ఆహ్వానించారు. గురువారం యువతులు, మహిళలు తమ ఇంటి ముంగిట్లో వేసిన అందమైన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం కుటుంబ సభ్యులకు, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద తమ మిత్రులతో కలిసి కొత్త ఏడాది తొలిరోజును ఆనందంగా జరుపుకొన్నారు.
కోటి ఆశలతో..మేటి సంబరాలతో..
కోటి ఆశలతో..మేటి సంబరాలతో..


