‘మన బడి’ బకాయిలు చెల్లించాలి
● ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ ● వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
గజ్వేల్‌రూరల్: పెండింగ్‌లో ఉన్న ‘మన ఊరు – మన బడి’కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం గజ్వేల్ పట్టణంలోని వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మించిన ‘మన ఊరు–మన బడి’కి సబంధించిన బిల్లులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశా రు. ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు, స్కూల్ కమిటీ చైర్మన్‌లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా అసెంబ్లీని నడిపిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొంటున్న ముఖ్య మంత్రి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ‘మన ఊరు–మన బడి’కి సంబందించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇందులో ఏవైనా అవకతవకలు జరిగినట్లు తెలితే ఈ అంశంపై శాసనసభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం అహ్మదీపూర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షు డు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
దుబ్బాకరూరల్: అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని తన స్వగ్రామమైన బొప్పాపూర్‌లో ఎంపీ రఘునందన్‌రావు ఓపెన్ జిమ్, ఉచిత వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతన సర్పంచ్‌లు అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఇళ్లపైన సోలార్ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.70వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ పెట్టు కోవడం వల్ల ప్రతి ఇంటికి రెండు కిలో వాట్ల విద్యుత్ సరఫరా చేసుకోచ్చాన్నారు. దీంతో విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ఎనగుర్తి నుంచి శిలాజినగర్ వరకు రోడ్డు వేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రసాద్, ఉప సర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


