డిగ్రీ కళాశాలలో నేడు అంతర్జాతీయ వెబినార్
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ వెబినార్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ఈ వెబినార్‌లో నేపాల్ త్రిభువన్ యూనివర్సిటీ ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ అంజనాసింగ్ పాల్గొంటారన్నారు. మైక్రోబయాలజీ సొసైటీ ఆప్ ఇండియా సహకారంతో కళాశాల సూక్ష్మజీవశాస్త్రం, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వెబినార్‌లో శస్త్రచికిత్స అనంతరం గాయసంక్రమణల్లో అనారోబిక్ బ్యాక్టీరియా అనే అంశంపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ వెబినార్‌తో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు శాసీ్త్రయపరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ స్థాయి అవగాహన పెంపొందుతుందన్నారు.


