గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ పేర్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మహాత్మాగాంధీ పేరును అవమానపర్చే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్ జీ పేరును పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు శివయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు.
అభ్యర్థుల ఖర్చుల వివరాలు సమర్పించాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతకపేటలో డీఎల్పీఓ వెంకటేశ్వర్లు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, దూల్మిట్ట మండలాల పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన గ్రామాలలో బ్యాంక్ అకౌంట్‌లను తెరవాలన్నారు. సర్పంచ్ అభ్యర్ధుల ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి సంజీవ్ ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ‘సర్వేజనా: సుఖినో భవంతు’ అధ్యక్షులు నారాయణ తెలిపారు. సమాజ సేవకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, యోగ, మెడిటేషన్, సంగీత, నృత్య గురువులు, సినీ, టీవీ, రంగస్థల కళాకారులు, కవులు, రచయితలు, క్రీడాకారులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు సర్వేజనాః సుఖినో భవంతు, డోర్ నెం. 1–20–164, పోస్టు: తిరుమలగిరి, గోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్ – 500015కు జనవరి 5లోగా దరఖాస్తులు పంపాలన్నారు. పూర్తి వివరాలకు 9652347207 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర


