మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం గొల్లపల్లి–ఉదయపూర్ ఉపసర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, వార్డు మెంబర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామస్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నది బీఆర్‌ఎస్ మా త్రమే అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


