ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ. 3.37 లక్షలు
హుస్నాబాద్‌రూరల్: పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయ హుండీ కానుకలను బుధవారం లెక్కించినట్లు ఈఓ కిషన్‌రావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.3,37,476 వచ్చిందన్నారు. సంగారెడ్డి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం పరిశీలకుడు వెంకటరమణారెడ్డి సమక్షంలో హుండీ కానుకలను లెక్కించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ తనిఖీ
చిన్నకోడూరు(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ 108 అంబులెన్స్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 వాహనంలో ఉన్న అత్యవసర మందులు, పరికరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చిన్నకోడూరు పీహెచ్‌సీని సందర్శించారు. 102 వాహనం వినియోగంపై వైద్యురాలు ఐశ్వర్యను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా కోఆర్డినేటర్ హరిరామ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు ఉపాధ్యాయుడు నరేశ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయు డు వెంగళ నరేశ్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ మేరకు అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్షుడు బైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. నరేశ్.. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య వీరన్న పర్యవేక్షణలో ‘రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు.. సిద్దిపేట జిల్లాపై కేస్ స్టడీ’ అనే అంశంపై పరిశోధన (పీహెచ్‌డీ) చేస్తున్నారన్నారు. కళింగ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో అంతర్జాతీయ సదస్సు జరగనుందని, ఈ సదస్సులో నరేశ్ పాల్గొననున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్‌పై అవగాహన
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి పేర్కొన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలుర పాఠశాలలో బుధవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ. 3.37 లక్షలు
ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ. 3.37 లక్షలు


