కాంగ్రెస్‌లోకి విఠలాపూర్ సర్పంచ్
చిన్నకోడూరు(సిద్దిపేట): విఠలాపూర్ బీఆర్‌ఎస్ సర్పంచ్ దాసరి నాగరాణి బుధవారం మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో సర్పంచ్ నాగరాణి, ఉప సర్పంచ్ యాదవరెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు సర్పంచ్, వార్డు సభ్యులు పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కృషి చేయాలని మంత్రి వివేక్ సూచించారు. బుధవారం హైదరాబాద్‌కు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


