విజ్ఞానం పంచి.. చైతన్యం పెంచి
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
దుబ్బాక: అక్షరజ్ఞానం లేని ఎందరో పేదప్రజలకు విజ్ఞానం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాదేవాలయం.. 125 ఏళ్ల చరిత్ర గల పెద్దగుండవెల్లి సీఎస్‌ఐ చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. స్వాతంత్య్రానికి పూర్వమే పెద్దగుండవెల్లిలో ఇంగ్లండ్ దేశానికి చెందిన వారు 1901లో చర్చిని నిర్మించారు. ఆ చర్చిస్థానంలోనే 2001 లో అన్ని హంగులతో పునఃనిర్మించారు. ఈ చర్చిలో ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుంటారు.
ప్రతి ఏటా ఘనంగా సంబరాలు
పెద్దగుండవెల్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతాక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. ఏసుక్రీస్తు నామస్మరణ చేస్తూ గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. కేక్ కట్‌చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు. చర్చిలో 100 కుటుంబాలకు పైగా ఒక్కచోట చేరి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు: హరీశ్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని క్రైస్తవులకు మాజీ మంత్రి హరీశ్‌రావు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.


