
మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈఓ ఆలయానికి ఉద యం రావడంతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ తన చాంబర్‌లో ఏఈఓ బుద్ది శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు నూతన ఈఓను మర్యాదపూర్వకంగా కలిశారు.
మద్యం దుకాణాలు బంద్
సిద్దిపేటకమాన్: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపా రు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఈ నెల 7వ తేదీ ఉదయం వరకు మూసివేసి ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం
హుస్నాబాద్: స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం లేకపోవడంతో సీట్లు నిండటం లేదని అధికారులు గుర్తించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అమ్మాయిలకు, టీచర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో అబ్బాయిలకు హాస్టల్ వసతి కల్పించారు. హుస్నాబాద్ బస్టాండ్ నుంచి కిషన్‌నగర్‌లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అభ్యసన సామగ్రితో
ఉత్తమ ఫలితాలు: డీఈఓ
కొమురవెల్లి(సిద్దిపేట): అభ్యసన సామగ్రి ఉపయోగించి బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించాలన్నారు. దీంతో విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రమేశ్, రాజమల్లయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
గజ్వేల్‌రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ. 8200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్

మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్

మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్