
నిర్మాణాలు వేగిరం చేయాలి
కలెక్టర్ హైమావతి
తొగుట(దుబ్బాక): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని తుక్కాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఇంటిలో కాకుండా బయట నిర్మించుకోవాలన్నారు. అంతకు ముందు స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ శ్యామల పాల్గొన్నారు.