
ఆరోపణలు తగవు
హుస్నాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోశ్‌రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కవిత బీజేపీకి అమ్ముడుబోయిందని విమర్శించారు. ఆమైపె ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు, తన రాజకీయ భవిష్యత్ కోసం హరీశ్‌రావును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. అంతక ముందు అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై సీబీఐ విచారణ నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.