
కవిత సస్పెన్షన్ సబబే..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ విషయంలో తమ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిన్నామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కొద్దిరోజులుగా కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. తప్పు చేస్తే కుటుంబసభ్యులైనా సహించబోనని గతంలోనే కేసీఆర్ చెప్పారన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుచుకుంటామన్నారు. కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.