
బీఆర్‌ఎస్ నిరసనలు.. దిష్టిబొమ్మ దహనాలు
ఎమ్మెల్సీ కవిత తీరుపై ఆగ్రహాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్సీ కవిత తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళనలతో అక్కన్నపేట మండలం కేంద్రం దద్దరిల్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాశేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసే కుట్ర చేస్తున్నారన్నారు.
కవిత దిష్టిబొమ్మ దహనం..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ నాయకులు మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ నిరసనలు.. దిష్టిబొమ్మ దహనాలు