
7న మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈనెల 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 1గంట నుంచి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణ, ప్రాతఃకాలపూజల అనంతరం స్వామి వారి దర్శనం కల్పించనున్నుట్లు తెలిపారు.
క్రీడల్లోనూ రాణించాలి
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్దిపేట అర్బన్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రోజూ చిన్నారులు ఆటలు ఆడాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య, మండల విద్యాశాఖ అఽధికారి రాజ ప్రభాకర్‌రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమిషనర్ రాజేంద్రకుమారేనా?
పదవీ విరమణ పొందినా ఆయన పేరే
చేర్యాల(సిద్దిపేట): పట్టణ ప్రజలను కమిషనర్ ఎవరనే అయోమయంలో పడేస్తోంది సిటిజన్ బడ్డీ యాప్. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లి, పదవీ విరమణ పొందిన రాజేంద్రకుమార్ పేరే యాప్‌లో కనబడటంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాల్సిన యాప్‌లో సరైన సమాచారం పొందుపర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కమిషనర్లు మారినా యాప్‌లో పేరు మారకపోవడం గమనార్హం. అలాగే పదవీకాలం ముగిసి నా పాలక వర్గం పేర్లు అవే కొనసాగడం విచిత్రం. ప్రస్తుత కమిషనర్ ఎస్. నాగేందర్ చొరవ చూపి బడ్డీ యాప్‌లో పేర్లు మార్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
తుది ఓటరు జాబితా విడుదల
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం తుది ఓటరు జాబితాను ప్రదర్శించింది. గత నెల 28న జాబితా ముసాయిదాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 508 పంచాయతీలు ఉండగా 4,508 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. ఇందులో 3,21,766మంది పురుషులు, 3,34,184 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు.
నిమజ్జన ఏర్పాట్లు
వేగవంతం చేయాలి
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్
సిద్దిపేటజోన్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక కోమటి చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనం ఘాట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. బ్యారికేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భారీ విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువు వద్ద గజ ఈతగాళ్ళు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పట్టణంలో పలు మరమ్మతుల పనులను పరిశీలించారు.

7న మల్లన్న ఆలయం మూసివేత

7న మల్లన్న ఆలయం మూసివేత

7న మల్లన్న ఆలయం మూసివేత