
ఉధృతంగానే కూడవెల్లి
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నిండుకుండలా రామసముద్రం చెరువు
ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు
కూడవెల్లి వాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో కూడవెల్లి వాగుపై ఉన్న 58 చెక్‌డ్యాంలు నిండి పరవళ్లు తొక్కుతున్నాయి. జగదేవ్‌పూర్ మండలం అలీరాజ్‌పేట శివారులో కూడవెల్లి వాగు పుట్టి.. గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, భూంపల్లి–అక్బర్‌పేట, దుబ్బాక మండలాలగుండా ప్రవహించి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎగువమానేరులో కలుస్తుంది. వాగు ఉధృతితతో చాలా గ్రామాలకు రాకపోకలు రెండురోజులుగా బంద్ అయ్యాయి. వరదలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. – దుబ్బాక

ఉధృతంగానే కూడవెల్లి